Saturday, April 20, 2024

జూలై 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలపై ఛార్జీల మోత మోగించింది. ఎస్‌బీఐ తాజాగా సవరించిన సర్వీసు ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయని ప్రకటించింది.

నగదు ఉపసంహరణల విషయంలో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్, ఏటీఎం కేంద్రాలలో కలిపి 4 సార్లు మాత్రమే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం ఛార్జీల విషయానికొస్తే.. ఏటీఎం, బ్రాంచ్‌లలో గరిష్టంగా 4 పర్యాయాలు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేకుండా నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదనపు విలువ ఆధారిత సేవలకు జూలై 1, 2021 నుంచి ఛార్జీలు వసూలు చేయడంపై ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. బ్రాంచ్‌లలో, ఏటీఏం కేంద్రాలో నగదు విత్‌డ్రా చేయడం, చెక్ బుక్‌కు సంబంధించిన ఛార్జీలు, బదిలీ చేయడం, ఆర్థికేతర లావాదేవీల విషయంలో ఛార్జీలు వసూలు చేస్తారు.

ఇది కూడా చదవండి: ఫిక్సుడ్ డిపాజిట్.. ఏ బ్యాంకులో బెస్ట్?

Advertisement

తాజా వార్తలు

Advertisement