Friday, April 26, 2024

వివాదానికి కార‌ణ‌మ‌యిన పొగ‌డ్తలు.. ద‌ర్శ‌కుడికి క్ష‌మాప‌ణ చెప్పిన స్టార్ న‌టుడు మ‌మ్ముట్టి

జూడ్ ఆంథ‌నీ జోసెఫ్ తెర‌కెక్కించిన చిత్రం2018. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ హీరో మ‌మ్ముట్టి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సినిమా ట్రైలర్ ను మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోసెఫ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.. పనిలో పనిగా ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు అని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. ఏదో పొగడాలి అని మమ్ముట్టి అన్న మాటలు నెగెటివ్ గా తీసుకున్నారు కొందరు నెటిజన్లు. జోసెఫ్ ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారని విమర్శించడం మొదలెట్టారు. సోసల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

దాంతో మమ్ముట్టి ఈ విషయంలో స్పందించారు.. జోసెఫ్ ను ప్రశంసిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. ఇంత వివాదానికి సెంటర్ పాయింట్ లాంటి దర్శకుడు జోసెఫ్ కూడా ఈ విషయంలో స్పందించారు. మమ్ముట్టికి మద్దతుగా జోసెఫ్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తనకు ఎక్కువ జుట్టు లేకపోవడం వల్ల తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ బాధపడటం లేదని అన్నారు. మమ్ముట్టి వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన హెయిర్ లాస్ పట్ల ఎవరైనా నిజంగా ఆందోళన చెందుతుంటే… షాంపూ కంపెనీలు, నీటిని సరఫరా చేస్తున్న బెంగళూరు కార్పొరేషన్ కు వ్యతిరేకంగా తమ పోరాటం సాగించాలని వెల్ల‌డించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement