Friday, April 26, 2024

స్థిరంగా బంగారం ధరలు…ఎంతో తెలుసా ?

దేశంలో బంగారం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు… ఏ వస్తువుకు లేనంత డిమాండ్ బంగారానికి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మగువలకు కూడా బంగారం అంటే ఎంతో మక్కువ. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 49,750 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,600కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 75,700కి వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement