Friday, April 19, 2024

Followup : ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష.. త్వరలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో కీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సై పరీక్షకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా 20 పట్టణాల్లో పరీక్షాకేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 91.3 శాతం మంది హాజరైనట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. మొత్తం 2 లక్షల 25 వేల 759 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష కీని త్వరలో టీఎస్‌ఎల్‌పీఆరీబీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ప్రిలిమినరీ రాత పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్షా కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. గత పరీక్షల్లో సామాజిక వర్గాల వారిగా మార్కులుండేవి.

ప్రిలిమ్స్‌ అర్హత మార్కులు 30 శాతానికి కుదింపు…

ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలున్నాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లేనని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement