Wednesday, April 24, 2024

షారుక్ ఖాన్.. వాచ్ ఎన్నికోట్లో తెలుసా

వాచ్ అంటే ఎంత ఉంటుంది మ‌హా అయితే వేల‌ల్లో అనుకుంటున్నారా..కానీ స్టార్ హీరో షారుక్ ఖాన్ వాచ్ ఎంతో తెలుసా కోట్ల‌రూపాయ‌లంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత హిట్ కొట్టారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. పఠాన్ సినిమా అందించిన అపురూప విజయంతో మాంచి ఊపుమీదున్నారు షారుఖ్ ఖాన్‌.. తాజాగా ఓ ఈవెంట్‌లో కనిపించి చర్చనీయాంశంగా మారారు షారుక్ ఖాన్. అందుకు కారణం అతడు ధరించిన వాచీనే. బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చిన షారుఖ్.. చేతికి బ్లూ కలర్ రిస్ట్ వాచ్ ధరించాడు. ఆ వాచీ ఖరీదు ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. చాలామంది తమ జీవితకాలంలో సంపాదించిన దానికంటే ఆ వాచీ విలువే ఎక్కువ.

ఒక్క ముక్కలో చెప్పాలంటే దాని ఖరీదు రూ. 4.98 కోట్లు. పఠాన్ చిత్రంలో షారుక్ ఖాన్ కి జోడీగా న‌టించిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో షారుఖ్ ఈ వాచీతో కనిపించాడు. వారిద్ద‌రూ మేక‌ప్ అవుతున్న‌ట్లు ఉన్న ఆ వీడియో ‘పఠాన్’ ఈవెంట్ కు ముందు తీసినది. షారుఖ్ ఖాన్ ధరించిన ఆ వాచీపై అభిమానుల దృష్టి పడింది. దీంతో ఫ్యాషన్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘డైట్ సబ్యా’లో ఆరా తీశారు. ఆ వాచీ ‘అడెమర్స్ పిగెట్‌’ అనే స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ తయారీ కంపెనీకి చెందినదని తెలిసింది. ఇది ఆ కంపెనీ రాయల్ ఓక్ పెర్‌పెచ్యుయల్ క్యాలెండర్ వాచీ అని, దాని విలువ రూ. 4.98 కోట్లని డైట్ సబ్యా నుంచి రిప్లై వచ్చింది. వాచ్ కే అన్నికోట్లు పెట్టారంటే..ఇక ఆయ‌న ఆస్తులు ఎన్నివేల‌కోట్లో అర్థ‌మ‌వుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement