Saturday, April 20, 2024

హస్తినలో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం..

  • బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివస్తున్న జనం
  • గరుడవాహన సేవలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తర భారతదేశంలోని శ్రీవారి భక్తుల కోసం బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం సాయంత్రం పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామివారి భక్తులంతా బ్రహ్మోత్సవాలలో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాది వారికి ఏడుకొండల వాడిని చేరువ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, స్థానిక సలహా మండలి చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి చీఫ్ జస్టిస్ ధన్యవాదాలు తెలిపారు.

కళ్యాణోత్సవం, గరుడవాహన సేవ సహా పూజాది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీశ్ చంద్ర ముర్ము, బీజేపీ నేత సంబిత్ పాత్ర సహా పలు రంగాలు చెందిన ప్రముఖులు ఆలయానికి విచ్చేశారు. శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకోవడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.

వాస్తు మార్పులతో పునర్నిర్మాణంకార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగిందని అన్నారు. ఢిల్లీ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, వాస్తు మార్పులతో పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ, ముంబైలలో కూడా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. జమ్మూలో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, నవీ ముంబైలో 10 ఎకరాల్లో దాతల సహాయంతో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement