Friday, April 19, 2024

శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ మూవీ టీజర్

శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సున‌య‌న హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న‌ సినిమా ‘రాజ రాజ చోర’. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం ఉదయం చిత్రయూనిట్ విడుదల చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి హ‌సిత్ గోలి ద‌ర్శ‌కుడు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుపుకుంటోంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ చేత చెప్పించిన కథ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. రాజు కిరీటాన్ని దొంగిలించిన దొంగ‌, కొంత కాలం రాజ‌సింహాసంపై కూర్చుని, ఆ త‌ర్వాత అస‌లు రాజు రావ‌డంతో ప‌లాయ‌నం చిత్త‌గిస్తాడు. త‌న‌ను మోసం చేసిన ఆ దొంగను ప‌ట్టుకోవ‌డానికి రాజు ఏం చేశాడు? చివ‌ర‌కు ఆ దొంగ దొరికాడా, లేదా? అనేదే ఈ చిత్ర క‌థ. కాగా ఈ సినిమా శాటిలైట్, స్ట్రీమింగ్ హక్కులను జీ నెట్ వర్క్ కొనుగోలు చేసింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ టాప్ ఈతగాళ్ల లిస్టులో ప్రిన్స్ మహేష్ తనయుడు

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement