Wednesday, March 22, 2023

బాల‌య్య స‌ర‌స‌న శ్రీలీల‌..

వీరసింహారెడ్డి తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం సెట్స్‌పై ఉంది. వరుస విజయా లు అందిస్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 108వ చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ లో శ్రీలీల పాల్గొంటోం ది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టు-కున్నట్లు-గా వున్న స్టిల్‌ విడుదల చేశారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌, మాస్‌ ఎలిమెం ట్స్‌, అనిల్‌ రావిపూడి మార్క్‌ వినోదం ఉండబోతున్నాయి. ఎస్‌ థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా. తమ్మిరాజు ఎడిటర్‌ గా, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement