Saturday, April 20, 2024

రాజీవ్​ హత్య కేసులో విడుదలైన దోషులు.. శ్రీలంకకు పంపే ఏర్పాట్లలో తమిళనాడు ప్రభుత్వం

దివంగత మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హత్య కేసులో దోషులు అయిన ఆరుగురు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే.. ప్రస్తుతం వారు పునరావాస శిబిరంలో ఉన్నారు. కాగా, రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన ఆరుగురిలో నలుగురు శ్రీలంక వాసులుగా తెలుస్తోంది. దీంతో వారిని దేశం నుంచి బహిష్కరించే ఉత్తర్వు 10 రోజుల్లో వస్తుందని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఇవ్వాల (సోమవారం) తెలిపారు.

తిరుచ్చిలోని పునరావాస శిబిరంలో శ్రీలంక ఖైదీలు- శంతన్, మురుగన్ అలియాస్ శ్రీ హరన్, రాబర్ట్ పయస్, జయకుమార్‌ను కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో తిరుచ్చి జిల్లా కలెక్టర్ ఎం. ప్రదీప్ కుమార్ మాట్లాడారు. ఓ ప్రక్రియ ప్రకారం ఒక కమ్యూనికేషన్ పంపిస్తామని చెప్పారు. తమిళనాడు నుండి వారి దేశానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని, అయితే.. వారు తమ పౌరులా కాదా అని ధ్రువీకరించిన తర్వాత ఈ చర్య తీసుకుంటామన్నారు.

ఈ కమ్యూనికేషన్ ఆధారంగా విదేశీ పౌరులను భారతదేశం నుండి బహిష్కరిస్తామని.. బహిష్కరణ ఉత్తర్వులు 10రోజుల్లో వచ్చే అవకాశం ఉందని కలెక్టర్​ ప్రదీప్​కుమార్​ అన్నారు. నలుగురు దోషులకు వేర్వేరుగా మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఖైదీలలో ఇద్దరు పాయస్, జయకుమార్ – శిబిరంలో ఉండడానికి స్థలం కావాలని కోరాగా.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దోషులు కోరిన విధంగానే ఆహారం అందజేస్తామని, వారి రక్తసంబంధీకులను కలిసేందుకు అనుమతిస్తామని చెప్పారు.

- Advertisement -

రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు మూడు దశాబ్దాల జైలు జీవితం గడిపిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నలుగురు శ్రీలంక వాసులు, మిగిలిన ఇద్దరు- నళిని శ్రీహరన్, రవిచంద్రన్ – తమిళనాడుకు చెందినవారు. నలుగురు శ్రీలంక వాసుల బహిష్కరణ బిడ్ పెండింగ్‌లో ఉందని అందుకని వారిని పునరావాస శిబిరంలో ఉంచినట్టు కలెక్టర్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement