Thursday, April 25, 2024

శ్రీవారిమెట్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తాం – పోకల అశోక్ కుమార్..

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ తిరుమలకి వెళ్ళే శ్రీవారిమెట్టు కొన్ని చోట్ల వర్షాలకు దెబ్బతినడంతో భక్తులకు అసౌకర్యం ఏర్పడిందని,అతి త్వరలో సిద్దం చేసి తిరుమలకి వెళ్ళేందుకు భక్తులకు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. శ్రీవారిమెట్టు వద్ద పోకల అశోక్ కుమార్ వెల్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.నడకదారిలో పడిన రాళ్ళను,మట్టిని త్వరగా తొలగించాలని,నడకదారి మధ్యలో దెబ్బతిన్న మెట్లను పరిశీలించి తొందరగా వాడుకలోకి తీసుకురావాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసారు.శ్రీనివాసమంగాపురం నుండి శ్రీవారిమెట్టుకు వెల్లె దారిలో కొన్ని విధ్యుత్ స్థంబాలు నేలకొరగడం వలన విద్యుత్ సమస్య నెలకొనింది అని తెలుసుకున్న ఆయన వెంటనే విధ్యుత్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే పనులు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆశోక్ కుమార్ మాట్లాడుతూ స్వామివారి కృపవలన ఎవ్వరికి ఎలాంటి నష్టం చేకూరలేదని,అనునిత్యం శ్రీవారి భక్తుల గురించి ఆలోచించే తమ టిటిడి పాలకమండలి చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తాము భక్తుల శ్రేయస్సే ముఖ్యంగా పనిచేస్తున్నామని, త్వరలోనే శ్రీవారిమెట్టును ఆధునికరించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు,రాత్రిపూట విశ్రాంతి తీసుకునేందుకు శ్రీనివాసమంగాపురం వద్ద విశ్రాంతి భవనాలు నిర్మించే ప్రతిపాదన వుందన్నారు.శ్రీవారికి తలనీలలు ఇచ్చేందుకు ఇప్పటికే ఇక్కడ కళ్యాణకట్ట ఏర్పాటుచేయడం జరిగిందని,తలనీలలు ఇచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నందునా రానున్న కాలంలో శ్రీనివాసమంగాపురంలో కళ్యాణకట్టను మరింత విస్తరించేలా టిటిడి చైర్మెన్ తో సంప్రదించి పాలకమండలికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీనివాసమంగాపురం, డిప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి,టెంపుల్ సుపర్డెంట్ రమణయ్య,ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement