Tuesday, April 23, 2024

శ్రీధ‌ర్ రావుపై అస‌హ‌జ లైంగిక దాడి కేసు న‌మోదు..

సంధ్య క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ స‌ర‌నాల శ్రీధ‌ర్ రావు మీద అస‌హ‌జ లైంగిక దాడి కేసు న‌మోదు అయింది. శ్రీధర్ రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు సనత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సనత్ నగర్ కు చెందిన సీహెచ్ చౌదరి స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ రావుపై సనత్ నగర్ పోలీసులు.. బెదిరింపులకు సంబంధించి ఈ నెల 18న ఎఫ్ఐఆర్(814/2021) నమోదు చేశారు. కాగా, చీటింగ్ కేసులో అరెస్టైన శ్రీధర్ రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్ట్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాయదుర్గం ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. శ్రీధ‌ర్ పై ప‌లు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement