Tuesday, March 26, 2024

ఓటీటీలో.. శ్రీదేవి శోభ‌న్ బాబు

శ్రీదేవి శోభ‌న్ బాబు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ మెగాడాటర్‌ సుష్మిక ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు ట్రైలర్‌ కాస్త ఆసక్తి పెంచడం వంటివి సినిమాపై కాస్తో కూస్తో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాయి. తీరా రిలీజయ్యాక డివైడ్‌ టాక్‌ తెచ్చుకుని డిజాస్టర్‌ కలెక్షన్‌లను రాబట్టింది. హీరో సంతోష్ శోభ‌న్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ప్రకటన వచ్చింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ దక్కించుకుంది. ఇక మార్చి 30 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రశాంత్‌ దిమ్మెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా తమిళ నటి గౌరీ కిషన్‌ హీరోయిన్‌గా నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement