Saturday, April 20, 2024

వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీలో స్పోర్ట్స్‌ ఫెస్ట్‌..

బాచుపల్లి, (ప్రభ న్యూస్‌) : ప్రగతినగర్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీ)లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 13వ అఖిల భారత అంతర ఇంజినీరింగ్‌ కళాశాలల క్రీడోత్సవం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో కేవలం దక్షిణభారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు నుంచి 1041 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఈ రెండు రోజుల స్పోర్ట్స్‌ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలను నిర్వహించనున్నట్టు కళాశాల క్రీడా సంచాలకులు డా. జి. శ్రీరామ వివరించారు.

వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి తమ కళాశాలకు వచ్చిన క్రీడాకారులను స్వాగతిస్తూ కళాశాల ప్రధానా ధ్యాపకులు ఆచార్య డా. సి.డి. నాయుడు మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్యానికే కాక మానసిక బలానికి, ఉల్లాసానికి కూడా ముఖ్యమని, క్రీడాకారులంతా జయాపజాయలతో నిమిత్తం లేకుండా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, థ్రోబాల్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఛెస్‌ వంటి ఇన్‌ డోర్‌ ఆటలు, అవుట్‌ డోర్‌ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు సహాయక విద్యార్థులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement