Thursday, April 18, 2024

NRI – స్పెల్లింగ్ బీలో దేవ్ షా విజేత‌…

న్యూయార్క్‌: అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీష‌న్‌లో భార‌తీయ మూలాలు ఉన్న దేవ్ షా విజేత‌గా నిలిచాడు. 11 అక్ష‌రాలు ఉన్న ప‌దాన్ని చెప్పి 50 వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకున్నాడు. ఫైన‌ల్లో అత‌ను psammophile అనే ప‌దాన్ని క‌రెక్టుగా ప‌లికాడు. వ‌ర్జీనియాకు చెందిన చార్లెట్ వాల్ష్ రెండో స్థానంలో నిలిచాడు. మెర్రియ‌మ్ వెబ్‌స్ట‌ర్ ప్రకారం psammophile అంటే మ‌ట్టిలో జీవించే పురుగు. psammo అంటే గ్రీకు భాష‌లో మ‌ట్టి. phile అంటే గ్రీకులో ప్రేమ అని అర్థం.

స్పెల్లింగ్ పోటీల్లో మొత్తం 11 మిలియ‌న్ల మంది పోటీప‌డ్డారు. దాంట్లో 11 మంది ఫైన‌లిస్టుల‌ను ఫైనల్ పోటీకి ఎంపిక చేశారు. దేవ్ విక్ట‌రీతో అత‌ని పేరెంట్స్ ఆనందంలో తేలిపోతున్నారు. కాగా, గ‌త ఏడాది టెక్సాస్‌కు చెందిన ఎన్ ఆర్ ఐ హ‌రిని లోగ‌న్ విజేత‌గా నిలిచింది. ఆమె మరో భార‌తీయ వ్య‌క్తి విక్ర‌మ్ రాజుపై గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement