Thursday, April 25, 2024

Special Trains : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు..

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప భ‌క్తుల కోసం ద‌క్ష‌ణ మ‌ధ్య‌రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. డిసెంబర్‌, జనవరి నెలల్లో మొత్తం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కొల్లం, కొట్టాయం మధ్య వీటిని నడుపుతామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్-కొల్లం రైలు నంబ‌ర్ 07133, డిసెంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9, 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లం-హైదరాబాద్‌ రైలు నంబ‌ర్ 07134, డిసెంబర్‌ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తుంది.
సికింద్రాబాద్‌-కొట్టాయం రైలు నంబ‌ర్ 07125, డిసెంబర్‌ 4,11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం-సికింద్రాబాద్‌ రైలు నంబ‌ర్ 07126 మధ్య డిసెంబర్‌ 5, 12, 19, జనవరి 2, 9 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
నర్సాపురం-కొట్టాయం రైలు నంబ‌ర్ 07119, డిసెంబర్ 2,9,16,30, జనవరి 6,13వ తేదీలలో తిరగనుంది. కొట్టాయం-నర్సాపురం రైలు నంబ‌ర్ 07120, డిసెంబర్ 3,10,17,31వ తేదీలతో పాటు జనవరి 7,14వ తేదీలలో నడవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement