Monday, June 5, 2023

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు : తులసి రెడ్డి

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని.. బిక్ష కాదని మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడం దుర్మార్గం, మోసమని అన్నారు. పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని?.. పార్లమెంటులో ఎందుకు అంగీకరించిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం.. ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయిందని తులసి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీలో ప్రత్యేక హోదా అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement