Wednesday, April 24, 2024

టీ20 ప్రపంచకప్ కోసం స్పెషల్ సాంగ్

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు వినోదం అందించేందుకు అక్టోబరు నెలలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగే ఈ ఐసీసీ మెగా ఈవెంట్ అక్టోబరు 17 నుంచి షురూ కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. ఈ టీ20 వరల్డ్ కప్ కోసం అధికారిక గీతాన్ని విడుదల చేశారు. బాలీవుడ్ మ్యూజిక్ డైర్టెర్ అమిత్ త్రివేది బాణీలు అందించిన ఈ గీతం క్రికెట్ అభిమానులను మరింత హుషారెత్తించేలా క్రికెట్ దిగ్గజాల యానిమేషన్ క్యారెక్టర్స్ తో సాగుతుంది. కాగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement