Sunday, May 9, 2021

పదవి నుండి తొలగించినందుకు ధన్యవాదాలు…ఈటెల

పథకం ప్రకారమే తన పదవి నుండి తొలగించారని అన్నారు మినిస్టర్ ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే ఆలోచన లేదని చెప్పారు ఈటెల రాజేందర్. నేను ఎన్నో ప్రలోభాలు, ప్రవాహాలను తట్టుకుని ఉద్యమంలో నిలబడ్డాను. నేను తప్పు చేశాను అంటే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు రావటం తనకు బాధను కలిగిస్తుంది.నా నియోజకవర్గ ప్రజల సూచనల మేరకే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాను అని రాజేందర్ అన్నారు. పదవి నుండి తొలగించి నందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాను. ఈటెల రాజేందర్ అంటే ఏంటో ఆ ప్రజల అభిమానమే నిదర్శనమని అన్నారు ఈటెల.

Advertisement

తాజా వార్తలు

Prabha News