Friday, November 8, 2024

SpaceX | స్టార్‌షిప్‌ ప్రయోగం సక్సెస్.. !

ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విజయవంతమైంది. స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ నింగిలోకి దూసుకెళ్లి విజ‌య‌వతంగా తిరిగి లాంచ్‌ప్యాడ్‌కు చేరుకుంది. అయితే, స్పేస్‌ఎక్స్ ఇప్పటి వరకు ఐదు స్టార్‌షిప్‌లను నింగిలోకి పంపింది… అందులో విజయవంతంగా లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన మొదటి రాకెట్ ఇదే కావ‌డం విశేషం.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఎలన్ మస్క్ స్పందించారు. ఇంజినీరింగ్ అద్భుతం అంటూ వీడియో పోస్ట్ చేశాడు. నిర్ణీత ప్రదేశంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఖచ్చితత్వంతో ల్యాండ్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో SpaceX రెండు లక్ష్యాలను సాధించిందని మస్క్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement