Saturday, April 20, 2024

బ‌న్నీ క్రేజ్.. ఇన్ స్టాలో 20మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవ‌ర్ల సంఖ్య 20మిలియ‌న్ల‌కి చేరింది. దాంతో బ‌న్నీ అరుదైన మైల్ స్టోన్ కి చేరుకున్నారు. దక్షిణాది నుంచి ఇలాంటి అరుదైన మార్క్‌ అందుకున్న తొలి నటుడిగా రికార్డుల్లోకెక్కాడు బన్నీ.కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్‌ పుష్ప..ది రూల్‌ సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్‌, సునీల్‌తోపాటు పలువురు పాపులర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప.. ది రైజ్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement