Thursday, April 25, 2024

South Korea : సియోల్‌లో భారీ అగ్నిప్రమాదం..  40 ఇళ్లు దగ్ధం

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాద‌లో చాలా మంది గాయ‌ప‌డ్డారు. రాజ‌ధానిలోని గుర్యోంగ్‌ ప్రాంతంలో భారీగా మంటలు చెల‌రేగాయి. వెంట‌నే స్థానికులు ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే 290 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 హెలికాఫ్టర్లు, పోలీసు యంత్రాంగం చాలా సేపు శ్ర‌మించి మంటలను అదుపు చేశారు. 40 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు, సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్క‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement