Sunday, December 8, 2024

IND vs SA | టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ మ‌న‌దే

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. సౌతాఫ్రికాలోని సెంచూరియన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ వేశారు. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

కాగా, ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ లో ముందంజ వేయాలనే పట్టుదలతో ఇరు జట్లూ బరిలోకి దిగనున్నాయి.

తుది జట్టు వివరాలు :

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా

Advertisement

తాజా వార్తలు

Advertisement