Friday, April 19, 2024

చాంద్ బ‌ర్దాయిగా సోనూసూద్ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

న‌టుడు సోనూసూద్ ఆచార్య చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించారు. కాగా ప్ర‌స్తుతం త‌న హోమ్ ప్రొడ‌క్ష‌న్ లో వ‌స్తున్న ఫ‌తేలో న‌టిస్తున్నాడు. కాగా సోనూసూద్ న‌టిస్తోన్న పృథ్వీరాజ్ చిత్రం నుండి సోనూసూద్ లుక్ ని రిలీజ్ చేశారు..బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ , 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చంద్రప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. సోనూసూద్ ఈ మూవీలో పాజిటివ్ రోల్ లో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ లో సోనూ సూద్ లుక్ కొత్తదనంతో ఆకట్టుకుంటోంది. పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవి చాంద్ బర్దాయి పాత్రలో సోన్ సూద్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను చిత్ర యూనిట్ తాజాగా షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement