Tuesday, April 23, 2024

బెజవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న సోనూసూద్

రియల్ హీరో సోనూ సూద్ బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. సోనూ సూద్ కు ఆలయ వర్గాలు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సోనూ సూద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నుంచి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

నేడు విజయవాడలో పర్యటించిచ సోనూసుద్…నగరంలో అంకుర సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అటు, సోనూ సూద్ రాకతో బెజవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆయన ఎక్కడికి వెళ్లినా వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో కోలాహలం నెలకొంది. రియల్ హీరో అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.

ఇది కూడా చదవండి: ధోని ఉన్నాడంటే కప్ మనదేనా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement