Thursday, April 25, 2024

సైకిల్ తొక్కిన సోనూసూద్..కారణం అదేనా..?

ఈ మధ్య సెలబ్రెటీలు సైకిల్ తొక్కితే పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. విజయ్ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా సైకిల్ పై వెళ్లాడని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తరువాత విజయ్ దానిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ఆచార్య సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు బుధవారం తెల్లవారుజామునే సోనుసూద్  సైకిల్ మీద వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి. కొందరు సోనూసూద్ ను గుర్తించి హాయ్ చెప్పగా.. చిరునవ్వుతోనే బదులిస్తూ.. హుషారుగా సాగిపోయాడు సోనూసూద్. 

Advertisement

తాజా వార్తలు

Advertisement