Friday, April 19, 2024

ఎన్నో రాత్రులొస్తాయి గానీ…

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ త్రిపాత్రా భినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్‌’. రాజేం ద్ర రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్ర వరి 10న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్‌’ మూవీ టీ-జర్‌, పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరొ పాటని చిత్ర బృందం విడుదల చేసింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘ధర్మక్షే త్రం’ సినిమాలోని మెలోడి సాంగ్‌ ” ఎన్నో రాత్రులొస్తా యిగానీ..” పాటకి ఇది రీమిక్స్‌ సాంగ్‌. ఈ రీమిక్స్‌ సాంగ్‌ను కూడా బాలు త నయుడు ఎస్‌.పి.బి.చర ణ్‌, సమీర భరద్వాజ్‌ ఆలపించారు. ఇళయ రాజా అందించిన ఈ ట్రాన్సింగ్‌ ట్యూన్‌ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది.ఈ పాట కళ్యాణ్‌ రామ్‌, ఆషికా రంగనాథ్‌ మధ్య సాగే రొమాన్స్‌ను చక్కగా ఎలివేట్‌ చేస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement