Tuesday, March 19, 2024

ఉండాల‌ని ఉంది నీతో…

సీనియర్‌ దర్శకుడు కె దశరథ్‌ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరథ్‌ కలిసి నిర్మిస్తున్నారు. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌, టీ-జర్‌ వీడియో విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ”ఉండాలని ఉందీ నీతో….” పాటని విడుదల చేశారు. కె వేద ఈ పాటని కంపోజ్‌ చేయగా.. తేలు విజయ, దీప్తి పార్థసారథి ఆలపించారు. వరికు ప్పల యాదగిరి అందించిన సాహిత్యం కథానాయిక మనసు లోని భావాలని అందంగా ఆవిష్కరించింది. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌ ల కెమిస్ట్రీ ఆకట్టు-కుంది.
సుధాకర్‌ బొర్రా , డి నాగేశ్వర్‌ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రా నికి కిషోర్‌ గోపు, శివ మొక్క స్క్రీన్‌ ప్లే అందించారు. ప్రవీణ్‌ వర్మ మాటలు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement