Wednesday, April 24, 2024

వైసీపీ మంత్రులు నోరు జారితే తోక కత్తిరిస్తాం: సోము వీర్రాజు

తిరుమల వెంకన్నతో జగన్ ఆడుకుంటున్నాడని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. జంబో పాలకమండలి నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. పాలకమండలి సభ్యుల నియామకంపై సీఎం జగన్ పునరాలోచన చేయాలని హితవు పలికారు. ఒకవేళ టీటీడీ సభ్యులను పెంచితే తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. క్రిస్టియన్ ఛారిటీలపై సీఎం జగన్ పెత్తనం చూపించగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. తమను తోకపార్టీ అన్న వైసీపీ నేతలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ మంత్రులు నోరు జారితే తోక కత్తిరిస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. ఎవరి తోకలు ఎప్పుడు కత్తిరిస్తామో వెయిట్ చేయండి అని పేర్కొన్నారు. పిషరీష్ శాఖ బడ్జెట్ ఎంతో మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పలేడు అని ఎద్దేవా చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని.. ఈ నెల 17న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 18న నిరుపేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు బిజెపి సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన సేవలను వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సేవా సమర్పణ అభయాన్ కరపత్రాలను బీజేపీ నాయకులు విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement