Thursday, December 1, 2022

పట్నం నుండి పల్లెలకు త‌ర‌లిపోతున్న మ‌ట్టి..

మొయినాబాద్‌, (ప్రభన్యూస్‌) : పట్నం మట్టి పల్లెకు తరలుతోంది. ఒకప్పుడు నగరంలో చేపట్టే నిర్మాణాలకు ఇసుక, ఎర్రమట్టి, మొరం వంటి వాటిని శివారు ప్రాంత పల్లెల నుంచి తరలించేవారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. పట్నంలో కొత్త నిర్మాణాల కోసం భారీ సెల్లార్‌ గుంతల తవ్వుతూ.. మట్టినంతా సమీప గ్రామాల్లోని శివార్లకు త‌ర‌లిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న ఫాంహౌస్‌లు, రోడ్ల నిర్మాణానికి దీన్ని వినియోగిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో టీప్పర్లు మట్టి, రాళ్లను మోసుకొస్తున్నారు. రాత్రి సమయంలో ఇవి ఎక్కువగా తిరుగుతున్నాయి.

- Advertisement -
   

భారీ సెల్లార్‌లు..

నగ రంలోని గ చ్చిబౌలి, నానక్‌ రామ్‌గూడ, మణికొండ, నర్సింగ్‌, కొకాపేట, గండిపేట ప్రాంతాల్లో ప్రస్తుతం భవన నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. భారీ అపార్ట్‌మెంట్ల కోసం పెద్ద పె ద్ద సెల్లార్‌ గుంతలు తవ్వుతున్నారు. తవ్విన మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన రావడంతో నగర శివారులోని మొయినాబాద్‌, శంషాబాద్‌, షాబాద్‌, చేవెళ్ల ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. రాత్రిపగ తేడా లేకుండా ఈ రవాణా కొనసాగుతుంది. మహానగరంలో చేపడుతున్న తవ్వకాల ద్వారా వస్తున్న మట్టి, మొరాన్ని ఫాంహౌస్‌లు, రోడ్లు బెస్మెంట్‌ బరంతులు నింపేం దుకు తరలిస్తున్నారు. మొయినాబాద్‌, షాబాద్‌, శంషాబాద్‌, చేవెళ్ల మండలాల్లో ప్రస్తుతం ఫాంహౌస్‌ల నిర్మాణం ఎక్కువగా జరుగుతుంది. వీరంతా నగరంలో నుంచి మట్టిని తెప్పించుకుంటున్నారు. ఇలా శివారు ప్రాంతాలకు నిత్యం సుమారు 6 వందల నుంచి 7 వందల టిప్పులు మట్టి తరలిస్తున్నారు.

ఆదాయం డబుల్‌…

సెల్లార్‌ గుంతల నుంచి ఫాంహౌస్‌ లు, ఇతర నిర్మాణాలకు తరలుతున్న మట్టి కాంట్రాక్టర్‌కు రెండింతలు ఆధాయం వస్తుంది. సెల్లార్‌ గుంతలు తవ్వడానికి యజమానులు వద్ద గుత్తాతీసుకుంటున్నారు. సెల్లార్‌ తవ్వేందుకు, మట్టి తరలించేందుకు నిర్ణయించిన సొమ్మును యజామానులు వీరికి చెల్లిస్తారు. అయితే తవ్వకాల ద్వారా వస్తున్న మట్టి, రాళ్లు, ముాెంన్ని ఫాంహౌస్‌ లు, రోడ్డుకు తరలిస్తున్న కాంట్రాక్టర్లు దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్‌కు రూ. 5వేలు నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రెండువైపులా లాభాలు ఆర్జిస్తున్నారు.

అధిక లోడ్‌తో వెళ్తున్నా..

రెండేళ్లుగా నగరం నుంచి శివారు ప్రాంతాలకు మట్టి తరలింపు కొనసాగుతుంది. నిత్యం హెవీలోడ్‌తో తిరుగుతున్న టిప్పర్లు, లారీలను అడ్డుకునే వారే లేరు. అనేకసార్లు ఇవి ప్రమాదాలకు కారణమయ్యాయి. మట్టి తరలించే కాంట్రాక్టర్లు ఇస్తున్న మామూళ్లకు ఆశపడి సంబంధితాధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement