Thursday, April 25, 2024

వీడియో: మనిషి కాళ్లను చుట్టేసిన పాము.. కొట్టి కొట్టి చంపిన వ్యక్తి

కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ఓ జెర్రిపోతు పాము కలకలం సృష్టించింది. పొదల నుంచి ఒక్కసారి బయటకు వచ్చిన పాము స్థానికులను బెంబేలెత్తించింది. గ్రామానికి చెందిన గడ్డమీది రాజయ్య పాములను పట్టడంలో నేర్పరి. గ్రామపంచాయతీ సమీపంలో అతనికి ఓ జెర్రిపోతు కనిపించడంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దాని మూతిపై కర్రతో నొక్కి పట్టాడు.

అయితే సదరు పాము తన తోకతో రాజయ్య కాళ్లను చుట్టేసి మెకాళ్లపైకి పాకుతూ.. పంచెలోకి దూరే ప్రయత్నం చేసింది. వెంటనే రాజయ్య దాని మూతి పట్టుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మాడుపు నర్సింహాచారి పాము నుంచి రాజయ్య కాళ్లను విడిపించాడు. అనంతరం రాజయ్య పామును కర్రతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం జరగగా.. శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement