Wednesday, April 24, 2024

గంజాయి రవాణకు తెగబడిన స్మగ్లర్లు…! తగ్గేదేలే అంటున్న పోలీసులు..

శృంగవరపుకోట, (ప్రభ న్యూస్‌): విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పుష్ప సినిమా దృశ్యాలు కనిపించాయి. ఈ సినిమాలో ట్యాంకర్లలో ఎర్రచందనం తరలిస్తే ఇక్కడ మాత్రం స్మగ్లర్లు ఎంతో తెలివి ప్రదర్శించి గంజాయి తరలించేందుకు వేసినప్లాన్‌ను తాము మాత్రం తగ్గేదేలే అంటూ పోలీసులు ఎంతో తెలివిని ప్రదర్శించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారి ప్రయత్నాలు తిప్పికొట్టారు. ఆదివారం ఉదయం ఎస్‌కోట పోలీసులకు తమ నమ్మకమైన ఇన్‌ఫార్మర్ల ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి వస్తుందని సమాచారం అందింది.. ఇది అందుకున్న సీఐ సింహాద్రినాయుడు సూచనల మేరకు ఎస్‌ఐ తారకేశ్వరరావు ఉదయం 7 గంటలకు బొడ్డవర చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అన్ని వాహనాల తనిఖీలు మొదలుపెట్టి సోదాలు చేశారు. అయితే ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారంలో భాగంగా ఒక ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ అరుకు ప్రాంతం నుండి ఎస్‌కోట రావడాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు లారీని ఆపేందుకు వెళ్తున్న క్రమంలో లారీ డ్రైవర్‌తో పాటు స్మగ్లర్లు పారిపోయారు. వెంటనే లారీని పోలీసుసిబ్బంది సాయంతో ఎస్‌ఐ తారకేశ్వరరావు స్టేషన్‌కు తీసుకొచ్చి తనిఖీలు చేయగా లారీ పెట్రోల్‌ట్యాంక్‌ అరలో దాచివుంచిన 750 కిలోల గంజాయి లభ్యమైంది.

పోలీసులు గంజాయిని తరలిస్తున్న ట్యాంకర్‌ను పట్టుకున్నారని సమాచారం బయటకు పొక్కడంతో స్ధానికులతోపాటు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ తతంగం గమనించారు. ఈ వ్యవహారం పుష్ప సినిమాలా సేమ్ టూ సేమ్‌ ఉందని అయితే అందులో స్మగ్లర్లు గెలిస్తే ఇక్కడ పోలీసులు సత్తాచాటి తగ్గేదేలేఅంటూ నిరూపించుకున్నారని అభినందించారు. గంజాయిను తరలించేందుకు స్మగ్లర్లు ఎన్ని వినూత్నమార్గాలు ఎంచుకుంటున్న పోలీసులు చేధిస్తు వారి ఆటులు కట్టించడం బాగుందని అంటున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement