Thursday, April 18, 2024

కార్మికుడితో బుజ్జి ఏనుగు సరదా పోట్లాట..

ఓ గున్న ఏనుగు తనకు సేవలు చేసే కార్మికుడని ఆటపట్టించింది. ఇప్పుడు ఆ వీడియో సోషలో మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడప్పుడు మన పెంపుడు జంతువులు మనతో సరదాగా చేసే పనులు ఎప్పటికి గుర్తిండిపోతాయి. అవి చేసే చిలిపి పనులు మనకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంటాయి. అవి మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు.. మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతుంటాయి. ఓ గున్న ఏనుగు ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని సరదాగా ఆటపట్టించింది. ఆయనతో మజాక్‌లు చేసింది. పనిచేయనీయకుండా అడ్డుకున్నది. తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. చివరకు ఆ పనివాడితో సరదాగా పోట్లాడింది. ఆయనను కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆయనపై కాస్సేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్‌.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement