Friday, March 29, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

ఇండియా లో బంగారంకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగువలకు కూడా బంగారం అంటే మక్కువ ఎక్కువ. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 48,710 కి చేరింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి 44,650కి చేరింది. అయితే మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండి దగ్గర రూ. 700 తగ్గి రూ.75,300కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement