Thursday, March 28, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారానికి దేశంలో ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే పడిచచ్చిపోతారు. కాగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,110 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,110 కి చేరింది. అయితే బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,400 పలుకుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement