Thursday, April 25, 2024

శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

  • రావణ వాహన సేవలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున
  • నేటి సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అయిదవ రోజు బుధవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంకాలం రావణ వాహన సేవలో స్వామి, అమ్మవార్లు విహరించనున్నారు. ఇక లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు నిర్వహించారు.ఇక సాయంత్రం శ్రీస్వామి,అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు. వీటిలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన కొనసాగుతుంది. ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన, పుష్కరిణి వేదిక, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement