Saturday, April 20, 2024

శివ‌రాజ్ కుమార్ ‘వేద’ ఫ‌స్ట్ లుక్

క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ ఐకానిక్ హీరో శివ‌రాజ్ కుమార్ తాజాగా న‌టించిన మూవీ వేద.. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వం లోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌ లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఫ‌స్ట్ ల‌క్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం లో శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం హర్ష, నిర్మాత గీతాశివరాజ్‌కుమార్, సినిమాటోగ్రఫీ స్వామి జె గౌడ్, ఎడిటర్ దీపు ఎస్ కుమార్, సంగీతం అర్జున్‌ జన్య,

Advertisement

తాజా వార్తలు

Advertisement