Tuesday, April 23, 2024

నేత్రపర్వంగా సీతారాముల కళ్యాణం… ముగిసిన సుందరకాండ కథాగానం

నారాయణపేట, (ప్రభ న్యూస్): వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నారాయణపేట జిల్లా కేంద్రంలోని జి.పి.శెట్టి ఫంక్షన్ హాల్ లో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి స్వాతి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వాతి దంపతులు జిల్లా కేంద్రంలోని జిపి శెట్టి ఫంక్షన్ హాల్ లో గత ఐదు రోజులుగా సుందరకాండ పారాయణ రచయిత ఎం.ఎస్ రామారావు మనవడు వేద పండితులు శ్రీనివాసరావు చే సుందరకాండ కథాగానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని ఆధ్యాత్మిక సొబగు, భక్తి పారవశంతో నేత్రపర్వంగా నిర్వహించారు.

- Advertisement -

అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు పట్టణంలోని గొడుగుగేరి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. సీతా సమేత ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్రగా సన్నాయి మేళ తాళాలతో జి.పి.శెట్టి ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన కళ్యాణమంటపంలో వేద పండితులు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువలా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ వేదమంత్రాలతో నారాయణపేట పట్టణమంతా మార్మోగింది. కళ్యాణం అనంతరం ఎమ్మెల్యే దంపతులు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ పి ఎన్ వెంకటేశ్వర్లు, డిఎస్పి సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ చంద్రకాంత్, ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్ రెడ్డి జడ్పిటిసి అంజలి, మరికల్ ఎంపీపీ శ్రీ కళ దంపతులు, కౌన్సిలర్లు జొన్నల అనిత సుభాష్, అమ్మపల్లి శిరీష చెన్నారెడ్డి, మేఘా శ్రీపాద్, దొడ్డి వరలక్ష్మి కతలప్ప, బసపురం నారాయణమ్మ వెంకటి, బండి రాజేశ్వరి శివరాం రెడ్డి, సరితా సతీష్ గౌడ్, మహేష్, బిఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు వేపూరి రాములు, విజయ సాగర్ ఇతర ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement