Friday, April 26, 2024

సీతారామాలయానికి విశేషఖ్యాతి..

ప్రభ న్యూస్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరంలోని పేరెన్నికగన్న కూకట్‌పల్లి నియోజక వర్గంలోని సీతారామ ఆలయం చరిత్ర భక్తులను అబ్బురపరుస్తోంది. భక్తుల కొంగుబంగారంగా మారిన ఆలయానికి దాదాపు 450 సంవత్సరాల చరిత్ర ఉన్నదన్న వాస్తవాన్ని ప్రజలు అక్కడి శాసనాల ద్వారా తెలుసుకొని మురిసిపోతున్నారు. ఇంతకాలం ఎవరికీ తెలియని విషయాలు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషితో వెలుగు చూస్తున్నాయి. చారిత్రక ఆలయ చరిత్రను స్వయంగా తెలుసుకున్న మాధవరం ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా.. చర్చనీయాంశంగా మారి చారిత్రక ఆలయ విశిష్ట త వెలుగు చూస్తోంది.

కూకట్‌పల్లిలోని సీతారామాలయాన్ని 450 సంవత్సరాల క్రితం జైనులకాలంలో నిర్మించినట్లు- అక్కడ శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే నాటి నుండి ఈ సీతారామాలయ ప్రతిష్ఠను ఎంతోమంది మహానుభావులు దూపదీప నైవేద్యాలతో కాపాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 1969లో ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పుడు కొంతమంది పెద్దలు దేవాలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు- చేసి, అప్పటి నుండి స్వామివారి నిత్యకైంకర్యాలు, శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఆలయ నిర్వహణ నామమాత్రంగా సాగుతూ ఉండగా, 2016లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తండ్రి పరమపదించారు. దీంతో దశ దిన కర్మలు, అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని, 11రోజుల అనంతరం కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్యే ఆలయంలో నిద్రకు విచ్చేశారు. ఆలయంలో నిద్రించేందుకు విచ్చేసిన మాధవరం ఆలయంలో అణువణువు పరిశీలించి ఇంతటి చరిత్ర గల ఆలయం ఇలా బూజు పట్టి శిథిలావస్థకు చేరడం కలచి వేసింది. తీవ్ర విషాదంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు, శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే దేవాలయాన్ని భావితరాలకు అందించాలన్న కాంక్ష కలిగింది. ఆనాడే ఆలయ ప్రధాన గోపురం నిర్మాణానికి దేవాదాయ శాఖ అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేసి రూ.10 కోట్ల వ్యయంతో నిర్మాణానికి తొలి అడుగు వేశారు.

అనంతరం భక్తుల కోరిక మేరకు గర్భాలయాన్ని కూడా పునర్నిర్మిం చాలన్న ఉద్దేశంతో గర్భాలయ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపూనుకున్నారు. దానికి కూడా తనవంతు నిధులు కేటాయించి, గర్భాలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ మూలమూ ర్తులకు కిరీటాలు, గుడి నిర్మాణానికి మొత్తం రూ.10 కోట్లు ఖర్చుకానుం డగా, ఇందు లో సగానికి పైగా మొత్తాన్ని ఎమ్మెల్యే మాధవరం వెచ్చిస్తుండటం గమనార్హం. ఈ ఆలయం కట్టడమంతా కూడా రాతితో నిర్మిం చడం మరో విశేషం.

భద్రాచలం, అయోధ్య సహా అనేక ప్రాం తాల్లోని ఆలయాల్లో సీత, లక్ష్మణ, హనుమత్‌ సమేతుడై రాముడు దర్శనమిస్తాడు. అయితే కూకట్‌పల్లిలోని సీతారామాలయంలో భరత, శత్రుజ్ఞులతో సహా పట్టాభిషిక్తుడైన సీతారామ స్వామి కొలువై ఉండటం ప్రత్యేకతను సంతరిం చుకుంది. ఇలా పట్టాభి సీతారాముడిగా కొలువై ఉండడంతో, తెలంగాణలోనే ప్రత్యేకత కలిగిన ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పిల్లలులేని వారు, కష్టాల్లో ఉన్న వారు, 40రోజుల పాటు మండల దీక్ష చేసి, రెండో భద్రాద్రిగా విరాజిల్లు తున్న ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement