Friday, March 29, 2024

TSPSC Leaks | బండి సంజయ్​కి సిట్​ నోటీసులు.. లీకేజీపై ఆధారాలు కోరిన అధికారులు

టీఎస్​పీఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. దీనిపై సిట్​ (స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​) బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే.. ఈ కేసును సవాల్​గా తీసుకున్న సిట్​ అధికారులు ఇప్పటికే 19 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి పలు దఫాలుగా వాంగ్మూలం రికార్డు చేశారు.

ఇక.. ఈ విషయమ్మీద పలు పార్టీల నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేత బండి సంజయ్​ మంత్రి కేటీఆర్​ను టార్గెట్​ చేసి తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్​ నేత రేవంత్​ రెడ్డి కూడా అదే విధమైన ఆరోపణలు చేశారు. దీంతో వారి దగ్గరున్న సమాచారం, దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సిట్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న సిట్​ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా, తనకు సిట్​ నోటీసులు ఇచ్చే దమ్ముందా అని బండి సంజయ్​ ప్రభుత్వానికి సవాల్​ చేశారు. ఇక.. ఆయనకు సిట్​ నోటీసులు ఇవ్వడంపై ఇప్పుడు సోషల్​ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘‘నువ్వే కావాలని కోరావుగా బండి.. ఇప్పుడు దూల తీరిందా”అని నెటిజన్లు సీరియస్​ కామెంట్స్​ చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ‘‘బఫూన్​ గాడికి బలే అయ్యిందిగా”అంటూ ఫన్నీ కామెంట్స్​ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement