Friday, April 26, 2024

ఇదేం ప్రేమరా బాబూ? తమ్ముడితో ప్రేమలో పడ్డ అక్క

కలికాలం అంటే ఇదే కాబోలు. మెదక్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని సొంత బాబాయ్ కుమారుడితో ప్రమలో పడింది. కరోనా కారణంగా కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఆ యువకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వాళ్లిద్దరూ కలిసి తిరుగుతుంటే సొంత అక్కా, తమ్ముడే కదా అని కుటుంబసభ్యులు భావించారు.

కానీ పెళ్లి వరకు దారితీసిన వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని భావించిన సదరు ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ్ముడిని ఇంటికి రమ్మని చెప్పిన యువతి.. తమ్ముడితో కలిసి మామిడి తోటకు వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పింది. కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన యువతి తల్లిదండ్రులు కూతురి కోసం ఆరా తీయగా తమ్ముడితో కలిసి పారిపోయిందని తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు అక్కాతమ్ముళ్ల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement