Thursday, March 28, 2024

సిరిమ‌ల్లె పువ్వా మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌

శ్రీకర్‌ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజయ్‌ ఘోష్‌, జయ నాయుడు, అమ్మ రమేష్‌, షఫీ క్వాద్రి నటీ- నటు-లుగా గౌతమ్‌ మైలవరం దర్శకత్వంలో కౌసర్‌ జహాన్‌ నిర్మించిన చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 10 న థియేటర్స్‌ లలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ జరిగింది. ముఖ్య అతిధులుగా దర్శకులు చంద్రమహేష్‌, సముద్ర హాజరయ్యారు. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ లు పాటలను, టీ-జర్‌ ను విడుదల చేశారు. నటుడు మాణిక్‌, నిర్మాత పద్మిని నాగులపల్లి, పంపిణీదారు రాజేంద్రతో పాటు- పలువురు పంపిణీదారులతో పాటు- చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

చిత్ర నిర్మాత కౌశర్‌ జహాన్‌ మాట్లాడుతూ ”ఒక -టైబల్‌ అమ్మాయి ఒక అబ్బాయిని స్వచ్చంగా ప్రేమిస్తే ఎన్ని ఇబ్బందులు పడింది? వంటి మంచి కథతో ఈ నెల 10 న వస్తున్నాం” అన్నారు. చిత్ర దర్శకులు గౌతమ్‌ మాట్లాడుతూ. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత కి హృదయ పూర్వక ధన్యవాదములు అన్నారు. హీరో శ్రీకర్‌ కృష్ణ, హీరోయిన్‌ నిక్కీ శ్రావణి మాట్లాడుతూ ..ఫిబ్రవరి 10 న విడుదల అవుతున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement