Thursday, April 25, 2024

మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’: త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/‌ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తదితరులు పాల్గొన్నారు.


ముఖ్య అతిథి, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో వెంకీ ఈ కథ చెప్పాడు. అతను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. . ధనుష్ మొదటి తెలుగు సినిమాలో మేం కూడా భాగమైనందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. వెంకీ చాలా మంచి సినిమా చేశాడు. అతనికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను” అన్నారు.
చిత్ర కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ..” 2002 లో నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు 2023 లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇది అద్భుతమైన ఎమోషన్స్, మెసేజ్ తో కూడిన సింపుల్ సినిమా అన్నారు.
చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. “ఒక సినిమా విజయం సాధించాలంటే అందరి కృషి ఉండాలి. ప్రివ్యూ చూశాక మా టీమ్ అందరి కాన్ఫిడెన్స్ చూసి, నా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. ముఖ్యంగా నిర్మాత వంశీ గారు ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శక నిర్మాతలకు, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement