Saturday, January 4, 2025

TG | హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ లో మ్యూజిక్ మస్తీ.. అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వ‌హిస్తున్న‌ ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల వేడుకల సందర్భంగా నేడు 8వ రోజు హైదరాబాద్‌లో విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఎయిర్ షో అనంతరం రాహుల్ సింప్లి గంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా విజయోత్సవాల వేళ ఆదివారం సాయంత్రం విద్యుత్ కాంతులతో ట్యాంకండ్ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. స్థానిక హెచ్ఎమ్డీఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement