Thursday, April 25, 2024

సింగ‌ర్ సునీత.. న‌టిగా మార‌నున్నారా..!

సింగ‌ర్ సునీత్ ఈ పేరు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు..త‌న మ‌ధుర‌మైన పాట‌ల‌తో ఎంతో ప్రేక్ష‌కాభిమానుల‌ని సొంతం చేసుకుంది. ఈమె న‌టిగా మార‌నున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సునీతను నటిగా పరిచయం చేసేది ఎవరో కాదట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ అన్న, అమ్మ, నాన్న వరుసగా కన్నుమూయడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు మహేష్ బాబు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందట. ఈ సినిమాలో సునీత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. SSMB 28అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు అక్కగా సునీత నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా ఆమెకూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా కావడంతో సునీత వెంటనే ఓకే చెప్పారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement