Friday, March 29, 2024

సిద్ధేశ్వ‌ర‌స్వామిజీ మృతి.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోడీ.. స్కూల్స్.. కాలేజీల‌కు సెల‌వు

సిద్ధేశ్వ‌ర‌స్వామి మృతిపై ప్ర‌ధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ట్విట‌ర్ ద్వారా సిద్ధేశ్వ‌ర‌స్వామీజీకి ఘ‌న నివాళి అర్పించారు. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేశారని సిద్ధేశ్వర స్వామి సేవలను కొనియాడారు. ఈ దుఃఖ ఘడియలో నా ఆలోచనలు ఆయన అనేక మంది భక్తులతో ఉన్నాయి. ఓం శాంతి! పేర్కొన్నారు. సిద్ధేశ్వర స్వామీజీ మృతి రాష్ట్రానికి తీరని లోటని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. విజయపూర్‌లోని జ్ఞానయోగాశ్రమానికి చెందిన సిద్ధేశ్వర స్వామీజీ మృతి చెందారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన అన్నారు.

తన ప్రసంగాల ద్వారా మానవాళి మోక్షానికి అద్భుతమైన, అద్వితీయమైన సేవ చేసారు. ఆయన భక్తులకు ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అని సంతాపం ప్రకటించారు. కర్ణాటకలోని విజయపూర్ కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో ఆయన సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. అతను కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఆశ్రమంలో స్వామీజీ తుదిశ్వాస విడిచినట్లు విజయపూర్ డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేశ్ దానమాన్వా తెలిపారు.మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు సిద్ధేశ్వర స్వామీజీ పార్థివదేహాన్ని ఆశ్రమంలో సాధారణ ప్రజల చివరి దర్శనం కోసం ఉంచుతారని, ఆ తర్వాత సైనిక్ స్కూల్ ప్రాంగణంలో భౌతికకాయాన్ని ఉంచుతారని అధికారిక ప్రకటన తెలిపింది.

- Advertisement -

భౌతికకాయాన్ని మరోసారి ఆశ్రమానికి తీసుకొచ్చి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అదే సమయంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు జ్ఞానయోగాశ్రమానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. మహారాష్ట్ర , ఆంధప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు వస్తున్నారు. స్వామీజీకి అశ్రు నివాళులర్పిస్తున్నారు. ఇక సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో.. విజయపూర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 3) ఆయన గౌరవార్థం పాఠశాలలు-కళాశాలలు .. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement