Thursday, March 28, 2024

బావ నాగ‌చైత‌న్యతో మ‌ర‌ద‌లు ఆశ్రిత‌.. షోయు ఫుడ్ బిజినెస్ విష‌యాలు తెలిపిన వెంక‌టేష్ కుమారై

హీరో నాగ‌చైత‌న్య షోయు అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్ న‌ర్ గా ఉన్నాడు. కాగా నాగ‌చైత‌న్య బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి బయట పెట్టే ప్రయత్నం చేసింది. షోయు కిచెన్ లో తన బావ నాగ చైతన్యతో ఆశ్రిత సరదాగా ముచ్చటించింది. నాగ చైతన్యని బావ అని ముద్దుగా పిలుస్తూ ఆశ్రిత అనేక విషయాలు తెలుసుకుంది. నేను మీకు ఈరోజు షోయు గురించి అనేక విషయాలు చెప్పబోతున్నాను. మా చై బావతో మాట్లాడబోతున్నా అని మొదలు పెట్టింది. నాగ చైతన్యకి స్వీట్ హగ్ ఇచ్చి ఇంటర్వ్యూ మొదలు పెట్టింది. షోయు గురించి తెలుసుకుంది. నాగ చైతన్య మాట్లాడుతూ షోయు అనేది రుచికరమైన జాపనీస్ ఫుడ్ కి తయారు చేయడం దీని ప్రత్యేకత.

నేను నా ఫ్రెండ్స్ ముందుగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ లో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం బాగా పెరిగింది. అందుకే షోయు ప్రారంభించాం అని నాగ చైతన్య తెలిపాడు. తన ఇష్టమైన వంటకాల గురించి ఆశ్రితకు వివరించాడు. షోయు కిచెన్ మొత్తం తిరుగుతూ వీరిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆశ్రిత ఆ కిచెన్ లో తయారు చేసే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లో చూపించింది. ఆశ్రిత తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. బావా మరదళ్ల సరదా ముచ్చట్లని నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఆశ్రిత వివిధ రకాల అంశాలపై వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement