Thursday, April 25, 2024

షాపింగ్ మాల్ లో కాల్పులు : 12మందికి గాయాలు

షాపింగ్ మాల్ లో కాల్పులు జరగడంతో 12 మంది గాయపడ్డ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కొలంబియాలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొలంబియానా సెంటర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా తాము భావించడం లేదని పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement