జర్మన్‌లోని ఓ చర్చిలో కాల్పుల కలకలం సంచలనంగా మారింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు సమాచారం. అయితే మృతుల సంఖ్య ఎంత అనేది పోలీసులు పక్కాగా చెప్పలేకపోతున్నారు.
- Advertisement -
ఘటనా స్థలంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. కాల్పులు జరిగిన సమయంలో విట్నెస్ వర్గానికి చెందిన ప్రజలు బైబిల్ అధ్యయనం చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు చనిపోయినట్టు తెలుస్తోంది.