Thursday, April 25, 2024

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. సీఎం చన్నీ మేనల్లుడు అరెస్టు.. అక్రమ మైనింగ్‌ కారణం..

అసెంబ్లి ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు భూపీందర్‌ సింగ్‌ హనీ జలంధర్‌ను అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. భూపీందర్‌ సింగ్‌ హనీ జలంధర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. దీనికి ముందు సుమారు 8 గంటల పాటు భూపీందర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) చట్టం కింద అరెస్టు చేశారు.

భూపీందర్‌ సింగ్‌ హనీ జలంధర్‌, అతని వ్యాపార భాగస్వామి ఇంట్లో గతనెల్లో పంజాబ్‌లోని మొహలీ, లూథియానా, రూప్‌నగర్‌, ఫతేఘర్‌ సాహిబ్‌, పఠాన్‌కోట్‌లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. బంగారం, కీలక డాక్యుమెంట్లు, మొబైల్‌ ఫోన్లు, రూ.21 విలువైన బంగారం, రూ.12 లక్షల రోలెక్స్‌ వాచీతో పాటు రూ.10కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ అరెస్టు.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే దశలో 117 స్థానాలకు ఫిబ్రవరి 20న అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement