Thursday, April 25, 2024

మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్

గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. పోటీ చేసిన 18 స్థానాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. దుగ్గిరాల మండలంలో పోటీ చేసిన 14 స్థానాల్లో 9 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

మరోవైపు జిల్లాలోని ప్రత్తిపాడు జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ బలపర్చిన విప్పాల కృష్ణారెడ్డి తన సమీప అభ్యర్థి గింజుపల్లి వెంకటేశ్వరరావుపై దాదాపు 8687వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇది తన విజయం కాదని, ప్రజల విజయంగా అభివర్ణించారు. మండల వైసీపీ నాయకులు కృష్ణారెడ్డికి అభినంధనలు తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement